Skip to main content

తైలాభిషేక పండుగలు ఎలా చేయాలి? చేయు విదానము?

మోషే సుఖోపవాస కూటములు (దైవసన్నిధి  ద్యానములు)
గమనిక : తైలాభిషేక పండుగలు 2018 ఆగస్టు 9,10   బైబిల్ మిషను స్వస్థత శాల, గుత్తి, అనంతపురం జిల్లా

          ఈ కూటములకు రాకడ వుపవాసములనీయు, వరముల కొరకైనా వుపవాసములనియు, అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు, దైవసన్నిధి  ధ్యాన దినములనియు పేర్లు గలవు.

ఈ కూటములను బైబిలు మిషను సంఘములన్నియు జులై 1 నుండి ఆగస్టు 9 వరకు (40 దినములు) జరిగించుకొని ఆగస్టు 10 వ తేదీన సన్నిధి పండుగ లేక తైలాభిషేక పండుగ జరుపుకొందురు.

ఈ కూటములు చేయు విధము :
1.           అందరూ మోకరించి త్రియేక దేవుని స్తుతి మూడు మార్లు చెప్పవలెను. అదేమనగ – తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమా, మహిమా, మహామహిమ, ఘనత, కీర్తి ప్రభావములు కలుగును గాక! ఆమేన్” ( ఒకరు చెప్పుచుండగా అందరూ పలుకావలెను)
2.           ఆలుగననే మోకరించియుండగా ప్రారంభ ప్రార్ధన చేసి, తర్వాత త్రియేక దేవుని స్తుతి కీర్తన “ శుభాకరా శుధాకరా” పాడవలెను.
3.          ఆ తర్వాత కూర్చొని దైవజనుడు దేవదాసు అయ్యగారు వ్రాసిన కీర్తనలలో ఏవేని 3 సన్నిధి కీర్తనలు పాడవలెను.
4.          తర్వాత మోకరించి “ దైవలక్షణముల స్తుతులు, సైతాను నేదిరించు సూత్రములు, సమర్పణ ప్రార్ధన, రాకడ ప్రార్ధన” చేయవలెను. ( ఒకరు చెపుచుండగా అందరూ పలుకవలెను)
5.          తర్వాత లేచి నిలవబడి బైబిలు గ్రంథములో నీర్గమకాండములోని 40 అధ్యాయములను రోజుకు ఒక ఆధ్యాయము చొప్పున చదవవలెను.
6.          తర్వాత మోకరించి 7 మెట్ల ధ్యానములో 6 మెట్లను  ( అనగా 1. మనోనిదానము, 2. పాపపుటోప్పుదల, 3. తీర్మానము, 4. సమర్పణ, 5. స్తుతి, 6. అంశాప్రార్ధన మెట్లను) 10 లేక 15 నిమిషములలో ముగించుకొని 7 వ మెట్టులో దేవా! నాకు కనబడుము నాతో మాట్లాడుము, దేవా! అందరికీ కనబడుము అందరితో మాట్లాడుము అని ప్రార్ధించి 2 గంటల సేపు మౌనముగా కనిపెట్టవలెను. ( అధమపక్షము 1 గంటయైనను మౌనముగా కనిపెట్టవలెను)
7.          కనిపెట్టిన తరువాత ప్రార్ధన చేసుకొని ముగించుకొనవచ్చును.

గమనిక: పగలు ఈ కూటము చేసుకొను వారు ఉదయము నుండి మçï 3 గంçï ల వరకు ఉపవాసముండి ఆ తరువాత భోజనం చేయవచ్చును. రాత్రి కాలమందు చేయువారు మçï  3 గంçïల నుండి రా  9 గంçïల వరకు ఉపవాసముండి ఆ తరువాత భోజనం చేయవచ్చును. అందువలననే ఈ కూటములకు సుఖోపవాసములు అను పేరు కలిగినది.
ఈలాగున 40 దినములు సన్నిధి ధ్యానములు ఎవరు సరిగా చేయూదురో అట్టివారికి తైలాభిషేక పండుగ ద్వారా 7 రకముల అభిషేకములు దేవుడు అనుగ్రహించును.
1. తైలబిషేకము, 2. రక్తాబిషేకము, 3. ఆత్మాభిషేకము, 4. ఆనంద భిషేకము, 5. ఆరోగ్య అభిషేకము, 6. ఈశ్వర్య అభిషేకము, 7. ఆగమన అభిషేకము,
అందువలననే బైబిలు మిషను – గుత్తి స్వస్థత శాలకు వచ్చు భాహువిస్తార విశ్వాసులు సంవత్సర ఆరంభము నుండి తైలాభిషేక పండుగల కొరకు ఆశతో ఎదురుచూచెదరు. తైలాభిషేక పండుగ నుందు వేలాది ప్రజలు తలస్నానము చేసి, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉపవాసముతో ఏకీభవించి భక్తిశ్రద్ధలతో దేవుని వాక్యము విని, ధ్యానములో పంక్తులు తీరి మోకరించి యుండగా తైలము తీసుకొని యేసునామములో ప్రార్ధించి ఒక్కొక్కరి తలపై పోయబడును. అభిషేక కార్యక్రమము అనంతరం ఆల్టరు మీద దైవసేవకులు మొదటి క్రోవ్వోత్తిని వెలిగించగా ఆ క్రొవ్వొత్తి వెలుగుతో సంఘమంతా ఒకరినొకరు మైనపు వతులు వెలిగించుకొని, వాటిని పట్టుకొని “ నేను వెలుగుడును అనేకులను వెలిగించేదనని” ప్రమాణము చేయుట జరుగును. అనంతరం అందరికీ ఆశీర్వాద భోజన ఏర్పాట్లు గావించబడును.అంతేగాక బైబిలు మిషను – గుత్తి ప్యారిష్ కు చెందిన సంఘములలో పలుచోట్ల తైలాభిషేక పండుగలు నీర్వహించబడి దేవుని ఘనపరచుట జరుగును. అందరూ తైలాభిషేక పండుగ కొరకు 40 దినములు సన్నిధి ధ్యానములు చేసి సిద్ధపడి పాల్గొనండి.
1 కోడిగ్రుడ్లు పి‌ఐ‌ఎల్లలుగా మారుటకు తల్లి ఆ గ్రుడ్లపై 21 రోజులు కూర్చుండినప్పుడు, ఆ తళ్ళికోడి వేడి గ్రుడ్లలోనికి వెళ్ళి పిల్లలు ఎలాగూ బయటకు వచ్చునో

2. అసహ్యముగా కనిపించు గొంగళి పురుగు కొద్దిదినములు ఎవరికిని కనబడకుండ లోపలికి వెళ్ళి అందమైన సీతాకోకచిలుకగా మారి ఎలాగు బయటకు వచ్చునో ఆలాగుననే దైవసన్నిధిలోనికి వెళ్ళి వారు, ఎటువంటివారైనాను దైవలక్షణములు అద్దబడి దేవుని రూపములోనికి వచ్చేదరని గమనిచగలరు. అందువలననే సన్నిధి కూటములను “నీతి సూర్యుని కళలద్దు దైవసన్నిధి” అని పిలిచేదారు. “ సుర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దున్ – సుర్యుండైనట్టి యెస్సు శుభగుణములద్దీన్”. ఆ యుద్దకంబు వాడి అంతర్థానంబైపోవు – ఈ యుద్దకంబు పోదు ఇది శాశ్వతముండు”. దేవుడు మీమీదకు ఈ ధ్యానముల ద్వారా రావలసిన దీవెనలు మెండుగా కుమ్మరించును గాక! ఆమెన్. 

Comments

Popular posts from this blog

బైబిల్ గ్రంథంలో తైలాభిషేక పండుగ గురించి వుందా?

నిర్గమకాండములోని సన్నిధి నిర్గమ 25:22. ప్రార్థన:- తండ్రీ! నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రీ! వందనములు. నీ సన్నిధిలేని స్థలములేధు. నీ సన్నిధికాంతి ప్రసరింపని చోటులేదు. పొడలోని సన్నిధిని యెడలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్యమర్మమెట్లు గ్రహింపగలము! సర్వ సంపూర్ణత నీ సన్నిఘిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి , ఈ వాక్య భాగమును వెలిగించుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్. నిర్గమకాడములో ఒక కథ : -                      ఒక పొద ఉన్నది. ఆ పొడలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాటలాడినాడు. మోషే దేవునితో మాటలాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్లుమని అబ్రహాముతో అనగా వెంటనే దేవునిమాట ప్రకారం వెళ్ళేను.                        ...

తైలాభిషేక పండుగలు బైబిల్ మిషను స్వస్థత శాల గుత్తి

మోషే సుఖోపవాస కూటములు (దైవసన్నిధి  ద్యానములు) గమనిక : తైలాభిషేక పండుగలు 2018 ఆగస్టు 9 ,10    బైబిల్ మిషను స్వస్థత శాల , గుత్తి , అనంతపురం జిల్లా ఈ కూటములకు రాకడ వుపవాసములనీయు , వరముల కొరకైనా వుపవాసములనియు , అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు , దైవసన్నిధి  ధ్యాన దినములనియు పేర్లు గలవు.    ఈ కూటములను బైబిలు మిషను సంఘములన్నియు జులై 1 నుండి ఆగస్టు 9 వరకు (40 దినములు) జరిగించుకొని ఆగస్టు 10 వ తేదీన సన్నిధి పండుగ లేక తైలాభిషేక పండుగ జరుపుకొందురు. ఈ కూటములు చేయు విధము : 1.            అందరూ మోకరించి త్రియేక దేవుని స్తుతి మూడు మార్లు చెప్పవలెను . అదేమనగ – “ తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమా , మహిమా , మహామహిమ , ఘనత , కీర్తి ప్రభావములు కలుగును గాక! ఆమేన్” ( ఒకరు చెప్పుచుండగా అందరూ పలుకావలెను) 2.            ఆలుగననే మోకరించియుండగా ప్రారంభ ప్రార్ధన చేసి , తర్వాత త్రియే...