Skip to main content

What is the meaning of "MaRaNaTha"("మరనాత" అనే పదానికి అర్థం ఏమిటి)

మరనాత" అనే పదానికి అర్థము. మాలాకి 3:1. యోహాను 5:25-29. 1కోరింథి 16:22  "ప్రభు వైన యెసూ, రమ్ము" ప్రకటన 22:20

                       హల్లెలోయ..... హల్లెలోయ...... హల్లెలుయ- మా ప్రభువు వచ్చుచూనాడు హల్లెలూయ
                     హల్లెలోయ..... హల్లెలోయ...... హల్లెలుయ- మా ప్రభువు వచ్చియూన్నాడు హల్లెలూయ
Image result for jesus christ coming soon pictures
" మరనాత" అను  ఈ మాట బైబిల్లులో 1 కోరింథ పత్రి క 16వ ఆద్యాయము 22వ వచనములోని క్రింది సూచనలో లిఖితమైన్నది. (1కోరింథ 16:22) మరియు ఈదే మాట ఇంగ్లిష్ బైబిల్లులో కూడా వున్నది. మరనాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువు వచ్చియున్నాడు లేక ప్రభువైన యేసు రమ్ము అని అర్థం. గ్రీకు భాషలోని పదమును తర్జుమా చేయకుండా అట్లే బైబిల్లో వుంచిన్నారు.
                         మొదటి శతాబ్దములోని క్రైస్తవులు కలిసికొన్నపుడు వుద్రేయకముతో ప్రభువు వస్తున్నారు అని అనుకోని వుళ్ళసించేవారు. గవర్నరు వచేముందు గ్రామములోని ప్రజలు వుత్సాహముతో చెప్పుకొన్నట్లు   ఎన్నిసార్లు సలములు చేసినా "మరనాత" అని అనవలెను. అనగా ప్రబువు వస్తునాడు అని అనుట సంతోషంతో     అనకపోతే అది మంచిదికాధు. ఒక విశ్వాసి మరనాత అనుట చూచి మోరోకా విశ్వాసి సంతోషించి మరనాత    "ప్రభువు రాకడ" వశ్వాసులకే గాని అందరకు కాధు. కొన్ని వందల సంవత్సరముల క్రీతమే రష్యాలో ఈస్టరు పండుగ రోజున ఒక విశ్వాసి "మరనాత" అని చెప్పగా, మరియొక విశ్వాసి అవును నిశ్చయముగా ప్రభువు లేచియున్నాడు అని తిరిగీ ఎదుటివారికి చెప్పే అలవాటు కలిగియుండిరి.
                        "మరనాత " అను మాటలో మూడు సంగతులను తెలియజేయు రెండు కలవు.
  1 ప్రభువు వచ్చుచున్నాడు'. ఈది ప్రవచనము.
  2 'ప్రభువైన యేసు రమ్ము'. ఈది ప్రార్థన. 
3 ప్రభువు వచ్చియున్నారు ఈది ప్రసంగము. గనుక ఈ మాటలో ప్రవచనము. ప్రార్థన, ప్రసంగము ఏమిడియున్నవి. మరనాత అనగా మారన్+ఆత అనగా సంస్కృతములో ఆగమనము అని ఆర్థం. ఇంగ్లిష్ come అనే మాటకు తర్జుమా  చేయువారు- "ఈప్పుడే, త్వరగా రమ్ము" అన్నట్లు తెలుగు బాషలోనికి వ్రాసిరి. మొదట శతాబ్దములోనివారు. గురుతులు చూడక              మునుపేవచ్చుచున్నాడని సంతోషించిరి. ఆ మొదటి శతాబ్దములోని వారే వస్తూన్నారని శంతోషించిన.యెడల గుర్తులు చూచిన మనము మరి ఎక్కువగా శంతోషించవలేను గదా! మనము ఆత్మకుమ్మరింపును గూర్చి ఈతరులకు బోదింపవలేను. 'అని గురుతులు నెరవేరినవి, ఆత్మ కుమ్మరింపు గురుతు జరుచున్నది గనుక అందరికీచెప్పండి. అప్పుడే అందురూ ఆత్మ కుమ్మరింప్పుకై కనిపెట్టుడురు. ఆత్మకుమ్మరింపు  పొందుదురు. ప్రభువు రాకముందు అందరూ ఆత్మను పొందవలేను. మీ చెవులు మూసికొని, 'రాకడ శంతోషము కలిగించుమని' ప్రార్థించిన ప్రభువు తప్పక కనబడును. (1) జన్మించిన ప్రభువు, (2) బోధించిన ప్రభువు, (3) సీలువ వేయబడిన ప్రభువు, (4) పునరుత్తానుడైన ప్రభువు, (5) ఆరోహణమైన ప్రభువు, (6) రాకడ ప్రభువుగా కనబడును.దర శుద్ది, శరీర శుద్ది చేసికొని ప్రార్ధనలో ఉండండి, ప్రభువు ప్రత్యక్షమౌను. మూఢవ్హక్తి వద్దు.ప్రభువు కనబడునని సంతోషించండి. ఒక దినమంతా ఉపవాస ప్రార్ధన చేసిన   తరువాత కనబడకపోతే చింతతో పండుకొంటే అప్పుడైనా ప్రభువు తప్పక కనబడును. ఇది దేవదాసు అయ్యగారి అనుభవము. ప్రభువు ఎప్పుడో వచ్చునని తలంచుటకాదు. ఈ కాలమే వచ్చేది అని నమ్మవలెను.

                                  నేడే ప్రభువు వచ్చుననుకొను-వాడే ధన్యుడు= ప్రభువు-కూడ మేఘమెక్కి-వెళ్ళకుండా నుండదు                     (లూకా 12:35-40) యేసు
మరనాత డ్రిల్: 1. నీకు తెలిసిన విశ్వాసి కనబడితే ప్రభువు వస్తున్నాడని మరనాత అను సలాము చేయవలెను. 2. అవిశ్వాసులను చూచిన మరనాత సలాముచేసి ప్రభువు రాకడ అర్థం ను తెలియజేయలి 3. ప్రభువైన యేసూ రమ్ము! అని రెండు చేతులు జోడించి చెప్పవలెను. ఈ మూడు డ్రిల్స్(అభ్యాసములు) మరనాత మాట క్రింద ఉన్నవి. 4.వెనుకకు తిరిగి అనగా పైడ్రిల్ అయిన పిమ్మట బడి పిల్లలు తరగతి గదులలోనికి వచ్చునట్లు పై మూడు విషయములు జరిగించిన పిమ్మట గదిలోనికి రాగా అనగా సన్నిధిలోనికి రాగా ప్రభువు కనబడును. ఇక్కడ మాట్లాడుట ప్రభువు వంతు. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడగును. 1కోరింథీ 16:22 దీని అర్ధమైమనగా, ప్రభువు జన్మము, ఆయన చరిత్ర శ్రమ విషయములలో, పునరుత్థాన విషయములలో ప్రేమించినవాడు. ప్రభువు రాకదను ప్రేమించకపోతే వానిది సంపూర్ణ ప్రేమ కాదు. గనుక వాడు శాపగ్రస్తుడని ఉన్నది. మరనాత ఆది సంఘములోని విశ్వాసుల హృదయములలో నాటుకొన్నది. మొదటి శతాబ్ధాములోని వీరు వెళ్ళిన తరువాత ప్రభువు రాలేదు అను దండకములు(బోధ) ప్రభలినవి. 2వేల సంవత్సరముల వరకు ప్రభలుచూనే ఉన్నవి. ఈ మరనాత శబ్ధము మొదటిగా ఎవరికి దగ్గరకు  వచ్చినది? మొదటి శతాబ్దములోని వారి దగ్గరకే గదా! ఈ చివరిశతాబ్ధాములోని వారి దగ్గరకు వచ్చినది గదా! వారు సందేహింపక నమ్మిరి. మనకు సందేహము కలిగినది.ఏ సందేహము? ప్రభువు ఇంకా రావడములేదు అను సందేహము. ప్రభువు ఎప్పుడు వస్తే మనకేమి? అనుకునేవారికి మరనాత అనగా చావు వచ్చును.అయితే నేడే ప్రభువు వచ్చునని అనుకొనే వారికి మరనాత అనగా ఆరోహణము వచ్చును. మీకు మారన్నత కావలెనా? మరనాత కావలెనా? మనకు చావు లేకుండా ఆరోహణమయ్యే మరనాత కావలెను. అట్టి దివ్యభాగ్యము తృత్వతండ్రి మీకు దయచేయును గాక! ఆమేన్.
మరనాత యనగా మన ప్రభువు-మరల వచ్చుట= దీనిన్ తరచుగా సలామున వాడు- నరులు ధన్యులు యేసు

Comments

Post a Comment

Popular posts from this blog

తైలాభిషేక పండుగలు ఎలా చేయాలి? చేయు విదానము?

మోషే సుఖోపవాస కూటములు (దైవసన్నిధి  ద్యానములు) గమనిక : తైలాభిషేక పండుగలు 2018 ఆగస్టు 9 ,10    బైబిల్ మిషను స్వస్థత శాల , గుత్తి , అనంతపురం జిల్లా           ఈ కూటములకు రాకడ వుపవాసములనీయు , వరముల కొరకైనా వుపవాసములనియు , అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు , దైవసన్నిధి  ధ్యాన దినములనియు పేర్లు గలవు. ఈ కూటములను బైబిలు మిషను సంఘములన్నియు జులై 1 నుండి ఆగస్టు 9 వరకు (40 దినములు) జరిగించుకొని ఆగస్టు 10 వ తేదీన సన్నిధి పండుగ లేక తైలాభిషేక పండుగ జరుపుకొందురు. ఈ కూటములు చేయు విధము : 1.            అందరూ మోకరించి త్రియేక దేవుని స్తుతి మూడు మార్లు చెప్పవలెను . అదేమనగ – “ తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమా , మహిమా , మహామహిమ , ఘనత , కీర్తి ప్రభావములు కలుగును గాక! ఆమేన్” ( ఒకరు చెప్పుచుండగా అందరూ పలుకావలెను) 2.            ఆలుగననే మోకరించియుండగా ప్రారంభ ప్రార్...

బైబిల్ గ్రంథంలో తైలాభిషేక పండుగ గురించి వుందా?

నిర్గమకాండములోని సన్నిధి నిర్గమ 25:22. ప్రార్థన:- తండ్రీ! నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రీ! వందనములు. నీ సన్నిధిలేని స్థలములేధు. నీ సన్నిధికాంతి ప్రసరింపని చోటులేదు. పొడలోని సన్నిధిని యెడలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్యమర్మమెట్లు గ్రహింపగలము! సర్వ సంపూర్ణత నీ సన్నిఘిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి , ఈ వాక్య భాగమును వెలిగించుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్. నిర్గమకాడములో ఒక కథ : -                      ఒక పొద ఉన్నది. ఆ పొడలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాటలాడినాడు. మోషే దేవునితో మాటలాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్లుమని అబ్రహాముతో అనగా వెంటనే దేవునిమాట ప్రకారం వెళ్ళేను.                        ...

తైలాభిషేక పండుగలు బైబిల్ మిషను స్వస్థత శాల గుత్తి

మోషే సుఖోపవాస కూటములు (దైవసన్నిధి  ద్యానములు) గమనిక : తైలాభిషేక పండుగలు 2018 ఆగస్టు 9 ,10    బైబిల్ మిషను స్వస్థత శాల , గుత్తి , అనంతపురం జిల్లా ఈ కూటములకు రాకడ వుపవాసములనీయు , వరముల కొరకైనా వుపవాసములనియు , అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు , దైవసన్నిధి  ధ్యాన దినములనియు పేర్లు గలవు.    ఈ కూటములను బైబిలు మిషను సంఘములన్నియు జులై 1 నుండి ఆగస్టు 9 వరకు (40 దినములు) జరిగించుకొని ఆగస్టు 10 వ తేదీన సన్నిధి పండుగ లేక తైలాభిషేక పండుగ జరుపుకొందురు. ఈ కూటములు చేయు విధము : 1.            అందరూ మోకరించి త్రియేక దేవుని స్తుతి మూడు మార్లు చెప్పవలెను . అదేమనగ – “ తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమా , మహిమా , మహామహిమ , ఘనత , కీర్తి ప్రభావములు కలుగును గాక! ఆమేన్” ( ఒకరు చెప్పుచుండగా అందరూ పలుకావలెను) 2.            ఆలుగననే మోకరించియుండగా ప్రారంభ ప్రార్ధన చేసి , తర్వాత త్రియే...